01INDIAN WOMEN – మహిళా చైతన్య కార్యక్రమం
ఆత్మస్థైర్యమే మహిళకు తొలి రక్షణ... అవగాహననే ఆమెకు నిజమైన శక్తి...
చిన్ననాటి నుంచే బాలికల్లో సామాజిక పరిస్థితులపై అవగాహన, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆత్మరక్షణ భావనలను పెంపొందించగలిగితే, వారు ఎదురయ్యే అనేక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలరనే నమ్మకంతో INDIAN WOMEN కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, దాడులు, వివక్షత, ఇతర సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తూ, అప్రమత్తంగా ఉండటం, ప్రమాదకర పరిస్థితులను గుర్తించడం, అవసరమైన సమయంలో ధైర్యంగా స్పందించడం, తమ భద్రత కోసం తగిన సహాయం పొందడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాము.
ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ బాలికలు, యువతుల్లో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాము.
మా ఆశయం: ప్రతి మహిళ భయంతో కాదు... ఆత్మవిశ్వాసంతో జీవించాలి. ప్రతి బాలిక తన భద్రత, హక్కులు, భవిష్యత్తు పట్ల అవగాహన కలిగి ధైర్యంగా ముందడుగు వేయాలి.







