01గ్రామస్థాయి సంక్షేమ సంఘాల ఏర్పాటు
విజయనగరం జిల్లాలో 83 గ్రామాల్లో విభిన్న ప్రతిభావంతుల సహకార సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి, వారి సమస్యలను గుర్తించడం, ఐక్యతను పెంపొందించడం, హక్కుల సాధన కోసం అవగాహన కల్పించడం జరిగింది.
ముఖ పేజీ / కార్యక్రమాలు / విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమాలు
83 గ్రామాల్లో సంక్షేమ సంఘాలు, 83 ట్రై సైకిళ్లు, 26 మందికి స్వయం ఉపాధి సహాయం, ప్రభుత్వ సేవలు.



సమాన హక్కులు • ఆత్మగౌరవం • స్వావలంబన • సమాన అవకాశాలు
శారీరక వైకల్యం శరీరానికే పరిమితం... మనసుకు కాదు, ప్రతిభకు కాదు, ఆత్మవిశ్వాసానికి కాదు.
సమాజంలోని విభిన్న ప్రతిభావంతులకు సముచిత స్థానం కల్పించి, వారు గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో, స్వతంత్రంగా జీవించేలా చేయాలనే ఆశయంతో అభిమాని ఫౌండేషన్ 2012 నుంచి 2026 వరకు నిరంతర సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది.
వారి హక్కుల సాధన, ప్రభుత్వ సంక్షేమ సేవలు అందించడం, స్వయం ఉపాధికి ప్రోత్సాహం, అవసరమైన సహాయక పరికరాల పంపిణీతో పాటు సమాజంలో వారిపట్ల గౌరవం, ఆదరణ పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.
విజయనగరం జిల్లాలోని 83 గ్రామాల్లో విభిన్న ప్రతిభావంతుల సహకార సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి, వారిని సంఘటిత శక్తిగా తీర్చిదిద్దుతూ, వారి సమస్యల పరిష్కారం మరియు హక్కుల సాధన కోసం కృషి చేయడం జరిగింది.
విజయనగరం జిల్లాలో 83 గ్రామాల్లో విభిన్న ప్రతిభావంతుల సహకార సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి, వారి సమస్యలను గుర్తించడం, ఐక్యతను పెంపొందించడం, హక్కుల సాధన కోసం అవగాహన కల్పించడం జరిగింది.
అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం ద్వారా అందించే బస్సు పాసులు, రైల్వే పాసులు, సదరం సర్టిఫికెట్లు తదితర సంక్షేమ సేవలు అందేలా సహకరించడం జరిగింది.
దాతల సహకారంతో 83 మంది విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లను అందించి, వారి రాకపోకలకు, స్వతంత్ర జీవనానికి మరియు దైనందిన అవసరాలకు తోడ్పాటు అందించడం జరిగింది.
26 మంది విభిన్న ప్రతిభావంతులకు పెట్టుబడి సహాయం అందించి, చిరు వ్యాపారాలు ప్రారంభించుకోవడం ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రోత్సహించడం జరిగింది.
అవసరమైన వారికి వినికిడి యంత్రాలు, చేతి కర్రలు తదితర సహాయక పరికరాలను అందించి, వారి జీవన ప్రయాణంలో అవసరమైన సహకారం అందించడం జరిగింది.
“వైకల్యం శరీరానికే... మనసుకు కాదు” అనే సందేశంతో బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు తదితర ప్రాంతాల్లో మ్యూజికల్ కాన్సర్ట్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, వందలాది మంది చిన్నారుల హృదయాల్లో మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవాభావం వంటి విలువలను పెంపొందించగలిగాము.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ, విభిన్న ప్రతిభావంతుల ప్రతిభను గుర్తించడం, వారి హక్కుల పట్ల అవగాహన కల్పించడం, సమాజంలో సమానత్వ భావనను పెంపొందించడం జరుగుతోంది.
విభిన్న ప్రతిభావంతులు సమాజానికి భారంగా కాకుండా, సమాజ అభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తింపు పొందాలి. వారికి సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు, స్వతంత్ర జీవనం లభించాలి.
వారి ప్రతిభకు గుర్తింపు... వారి జీవితాలకు భరోసా... వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే సమాజాన్ని నిర్మించడమే అభిమాని ఫౌండేషన్ ఆశయం.
వారి హక్కుల కోసం మా పోరాటం...
వారి స్వావలంబన కోసం మా సహకారం...
వారి ఆత్మగౌరవం కోసం మా సేవా ప్రయాణం...
మానవ సేవే మా ధ్యేయం... సమానత్వమే మా మార్గం...