ముఖ పేజీ / కార్యక్రమాలు / ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ – సేవా భాగస్వామ్యం

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ – సేవా భాగస్వామ్యం

1990 నుంచి రెడ్ క్రాస్ వాలంటీర్, రక్తదాన శిబిరాలు, 2016 నుంచి జిల్లా శాఖ బాధ్యతలు.

అభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటో

మానవత్వంపై అభిమానంతో... సేవా భావంతో...

మానవత్వం పట్ల అభిమానంతో ప్రారంభమైన సేవా ప్రయాణం

చిన్ననాటి నుంచే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పట్ల ఎంతో అభిమానం, గౌరవం కలిగి ఉండటం వల్ల 1990 సంవత్సరం నుంచి రెడ్ క్రాస్ చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాల్లో వాలంటీర్‌గా పాల్గొంటూ మా సేవా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది.

రెడ్ క్రాస్‌తో మా సేవ

01రక్తదాన శిబిరాల నిర్వహణ – రెడ్ క్రాస్‌కు అండగా

అభిమాని ఫౌండేషన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రెడ్ క్రాస్ సొసైటీకి సహకరిస్తూ, అనేక రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా రక్తం అవసరమైన వారికి ప్రాణదాతలుగా నిలిచే రక్తదాతలను సమకూర్చడంలో మా వంతు కృషి చేశాము.

రక్తదాన శిబిరాల నిర్వహణ – రెడ్ క్రాస్‌కు అండగారక్తదాన శిబిరాల నిర్వహణ – రెడ్ క్రాస్‌కు అండగారక్తదాన శిబిరాల నిర్వహణ – రెడ్ క్రాస్‌కు అండగారక్తదాన శిబిరాల నిర్వహణ – రెడ్ క్రాస్‌కు అండగా

02రెడ్ క్రాస్‌లో బాధ్యతలు – సేవా అనుబంధం

ఈ సేవా అనుబంధంలో భాగంగా 2016–2023 వరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం జిల్లా శాఖలో మేనేజ్‌మెంట్ కమిటీ (MC) సభ్యుడిగా సేవలందించాము.

అనంతరం 2023–2026 వరకు జిల్లా శాఖ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యాము.

03మానవతా విలువలే మా ప్రేరణ

రెడ్ క్రాస్ ఆశయాలు, మానవతా విలువలు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలనే సేవా స్ఫూర్తి మా సామాజిక సేవా ప్రయాణానికి ఎంతో ప్రేరణనిచ్చాయి.

మా రెడ్ క్రాస్ ప్రయాణం

1990నుంచిరెడ్ క్రాస్ వాలంటీర్
2016–2023MC సభ్యులువిజయనగరం జిల్లా శాఖ
2023–2026వైస్ ఛైర్మన్జిల్లా శాఖ
మానవత్వమే మన ధర్మం...ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే మన బాధ్యత...