ముఖ పేజీ / దార్శనికత & లక్ష్యం

దార్శనికత & లక్ష్యం

మా దార్శనికత, మా లక్ష్యం

మేము ఎందుకు సేవ చేస్తాం, ఎలా చేస్తాం: ఫౌండేషన్ మాటల్లోనే.

ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితం – ప్రతి ఒక్కరికీ అభివృద్ధి

పొదుపు సమావేశంలో గ్రామీణ మహిళలు, ఆంధ్రప్రదేశ్
గిరిజన గ్రామంలో పిల్లలు
మా దార్శనికత

వివక్ష లేని పరస్పర సేవ

సమాజంలోని ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, కులం, మతం, ఆర్థిక స్థితి, ధనిక–పేద అనే భేదాలు లేకుండా అవసరమైన సమయంలో ఒకరికొకరు అండగా నిలిచే సేవా భావాన్ని పెంపొందించడం అభిమాని ఫౌండేషన్ యొక్క ప్రధాన దార్శనికత.

ప్రతి మనిషిలో సామాజిక బాధ్యతను, సేవా భావాన్ని పెంపొందిస్తూ, ముఖ్యంగా యువతను సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దడం మా ఆశయం.

ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక భద్రత, సమాన అవకాశాలు మరియు స్థిరమైన అభివృద్ధి ద్వారా అణగారిన, నిరుపేద, వెనుకబడిన ప్రజల జీవితాల్లో ఆశాజ్యోతి వెలిగించి, వారు గౌరవంగా, ఆత్మగౌరవంతో జీవించే సమాజాన్ని నిర్మించేందుకు నిరంతరం కృషి చేయడం మా దార్శనికత.

ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితం – ప్రతి ఒక్కరికీ అభివృద్ధి

మా లక్ష్యం

మానవత్వమే ప్రథమ ధర్మం... సేవే మా జీవన మార్గం...

సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలుస్తూ, సేవను కేవలం సహాయంగా కాకుండా సామాజిక బాధ్యతగా, మానవతా ధర్మంగా భావించడం అభిమాని ఫౌండేషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం.

ప్రతి ఒక్కరూ గౌరవంతో, ఆత్మగౌరవంతో, సమాన అవకాశాలతో జీవించే సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తూ, బాధితులకు భరోసా, నిరుపేదలకు చేయూత, యువతకు స్ఫూర్తి, సమాజానికి సేవా చైతన్యం కల్పించడం మా ఆశయం.

సేవ ద్వారా మానవత్వాన్ని పెంపొందిస్తూ, సమిష్టి భాగస్వామ్యంతో సమానత్వం, సామాజిక న్యాయం, దీర్ఘకాలిక అభివృద్ధి సాధించే సమాజ నిర్మాణం కోసం అభిమాని ఫౌండేషన్ నిరంతరం పనిచేస్తుంది.

స్వయం సహాయక సంఘం సమావేశంలో మహిళలు
మా కార్యాచరణ లక్ష్యాలు

మా లక్ష్యాన్ని ఆచరణలో పెట్టే పది మార్గాలు

  1. ఆరోగ్య పరిరక్షణ01ఆరోగ్య పరిరక్షణప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పిస్తూ, అవసరమైన ఆరోగ్య సేవలకు తోడ్పడడం.
  2. విద్యాభివృద్ధి02విద్యాభివృద్ధివిద్యకు దూరమవుతున్న పిల్లలు, యువతకు విద్యా అవకాశాలు మరియు ప్రోత్సాహం అందించడం.
  3. పర్యావరణ పరిరక్షణ03పర్యావరణ పరిరక్షణప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు అవగాహన మరియు కార్యాచరణ చేపట్టడం.
  4. మానవతా విలువల పెంపొందింపు04మానవతా విలువల పెంపొందింపుసేవాభావం, సహానుభూతి, సామాజిక బాధ్యత వంటి విలువలను ప్రజల్లో పెంపొందించడం.
  5. వికలాంగులకు చేయూత05వికలాంగులకు చేయూతదివ్యాంగులు గౌరవంగా, స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన సహకారం అందించడం.
  6. జాతీయ సమైక్యత06జాతీయ సమైక్యతకుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ఐక్యత మరియు సోదరభావాన్ని పెంపొందించడం.
  7. వృద్ధులకు అండ07వృద్ధులకు అండఒంటరిగా జీవిస్తున్న, నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు సహాయం, భరోసా మరియు సేవలు అందించడం.
  8. గిరిజనుల అభ్యున్నతి08గిరిజనుల అభ్యున్నతిగిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, జీవనోపాధి మరియు సామాజిక అభివృద్ధికి తోడ్పడడం.
  9. ఆకలి నిర్మూలన09ఆకలి నిర్మూలననిరుపేదలు, నిస్సహాయులు మరియు అవసరంలో ఉన్నవారికి ఆహారం అందించి ఆకలి తీర్చడం.
  10. మహిళా సాధికారత10మహిళా సాధికారతమహిళలకు స్వావలంబన, సమాన హక్కులు, ఆత్మవిశ్వాసం కల్పించడం.
ఫోటో క్రెడిట్స్

“Wikimedia Commons” అని ఉన్న ఫోటోలు క్రెడిట్‌తో ఉపయోగించిన ఉచిత ఫోటోలు; మిగతా అన్నీ ఫౌండేషన్ సొంత కార్యక్రమాల ఫోటోలు.