ముఖ పేజీ / కార్యక్రమాలు / అవయవదాన అవగాహన కార్యక్రమాలు

అవయవదాన అవగాహన కార్యక్రమాలు

2008 నుంచి 1,45,600+ నేత్రదాన ప్రతిజ్ఞలు, 42,300+ అవయవదాన ప్రతిజ్ఞలు, సంపూర్ణ శరీరదాన చైతన్యం.

అభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటో

మరణం తర్వాత కూడా... మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చు!

మానవతా విలువలు కలిగిన సమాజ నిర్మాణానికి త్యాగగుణం, సేవాభావం, ఇతరుల పట్ల బాధ్యత మనిషిలో పెంపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ, మరణానంతరం కూడా మనిషి మరొకరికి జీవన వెలుగులు అందించగలడనే గొప్ప సందేశంతో 2008లో నేత్రదానం, అవయవదాన అవగాహన కార్యక్రమాలకు అభిమాని ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది.

దానం అనేది కేవలం సంపదను ఇవ్వడం మాత్రమే కాదు... మన మరణానంతరం కూడా మరొకరికి జీవితాన్ని అందించగల గొప్ప త్యాగం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నాము.

మా సేవా కార్యక్రమాలు

01నేత్రదాన ఉద్యమం – Charity Club

నేత్రదానం ద్వారా అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చనే ఆశయంతో ముందుగానే నేత్రదాన ప్రతిజ్ఞ చేసేలా Charity Club కార్యక్రమాన్ని రూపొందించి, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాము.

  • సుమారు 1,45,600 నేత్రదాన ప్రతిజ్ఞ పత్రాలు సేకరణ.
  • వందలాది కార్నియాల సేకరణకు సహకారం.
  • సేకరించిన కార్నియాలను నేత్రనిధికి అందించడం.
  • నేత్రదానం ద్వారా అంధత్వ నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించడం.
నేత్రదాన ఉద్యమం – Charity Clubనేత్రదాన ఉద్యమం – Charity Clubనేత్రదాన ఉద్యమం – Charity Clubనేత్రదాన ఉద్యమం – Charity Club

02అవయవదాన అవగాహన కార్యక్రమాలు

2012 నుంచి శరీరంలోని వివిధ అవయవాలు మరొకరి ప్రాణాలను కాపాడగలవనే సందేశంతో అవయవదాన అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, అవయవదానం పట్ల ఉన్న అపోహలను తొలగించి, దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తున్నాము.

  • 42,300 అవయవదాన ప్రతిజ్ఞ పత్రాల సేకరణ.
  • వందలాది అవగాహన సదస్సుల నిర్వహణ.
  • యువత, విద్యార్థులు, ప్రజల్లో అవయవదానంపై చైతన్యం.
  • మరణానంతరం అవయవదానం ద్వారా ఇతరులకు జీవించే అవకాశం కల్పించాలనే మానవతా భావనను ప్రోత్సహించడం.
అవయవదాన అవగాహన కార్యక్రమాలుఅవయవదాన అవగాహన కార్యక్రమాలుఅవయవదాన అవగాహన కార్యక్రమాలుఅవయవదాన అవగాహన కార్యక్రమాలు

03సంపూర్ణ శరీరదానం (Whole Body Donation)

వైద్య విద్య, పరిశోధన, భవిష్యత్తు వైద్యుల శిక్షణకు సంపూర్ణ శరీరదానం ఎంతో విలువైనదనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ, Whole Body Donation ప్రతిజ్ఞ కార్యక్రమాలకు కూడా సహకరిస్తున్నాము.

మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడేలా శరీరదానం చేయాలనే గొప్ప ఆలోచనను ప్రజల్లో పెంపొందిస్తూ, త్యాగం మరియు సేవాభావానికి కొత్త అర్థాన్ని అందిస్తున్నాము.

మా సేవా ప్రభావం

1,45,600+నేత్రదాన ప్రతిజ్ఞలు
42,300+అవయవదాన ప్రతిజ్ఞలు

వందలాది అవగాహన సదస్సులు • కార్నియా సేకరణ • సంపూర్ణ శరీరదాన చైతన్యం

మా సందేశం
“మన జీవితం ముగిసినా... మన త్యాగం మరొకరి జీవితంలో వెలుగై నిలవాలి.”
“నేత్రదానం చూపునిస్తుంది... అవయవదానం ప్రాణాన్ని నిలబెడుతుంది... శరీరదానం వైద్య విజ్ఞానానికి మార్గం చూపుతుంది.”

మానవత్వమే మన మతం, త్యాగమే మన విలువ, మరొకరి జీవితంలో వెలుగు నింపడమే మన లక్ష్యం.

అభిమాని ఫౌండేషన్ — మనిషి జీవించి ఉన్నప్పుడే కాదు, మరణానంతరం కూడా మానవ సేవకు అవకాశం కల్పించే చైతన్య ఉద్యమం.