01తిత్లీ తుఫాన్ బాధితులకు సహాయం
తిత్లీ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు అభిమాని ఫౌండేషన్ సహాయక కార్యక్రమాలు నిర్వహించింది. బాధితులకు వారం రోజులకు సరిపడా 1,200 కిరాణా సరుకుల కిట్లు, కూరగాయలు అందించి వారి అవసరాలకు తోడ్పడింది.
అలాగే విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా 300 సెట్ల స్టడీ మెటీరియల్, నోట్‌బుక్స్, డిక్షనరీలు, కంపాస్ బాక్సులు అందించి విద్యార్థులకు అండగా నిలిచింది.
బొబ్బిలి నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ, మూడు పర్యాయాలు మందస, టెక్కలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో పర్యటించి బాధితులకు సహాయం అందించాము. ఈ సేవా కార్యక్రమాల్లో దాతలు అందించిన సహకారం ఎంతో విలువైనది, మరువలేనిది.



