ముఖ పేజీ / కార్యక్రమాలు / ఆరోగ్య పరిరక్షణ

ఆరోగ్య పరిరక్షణ

హెల్త్ కార్డులు, ఉచిత ఆక్సిజన్, రక్తదాన & నేత్ర శిబిరాలు, గుండె వైద్యం, మలేరియా నివారణ మరియు మరెన్నో.

అభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటో

ఆరోగ్యమే మహాభాగ్యం... ప్రతి ఒక్కరికీ వైద్యం అందడం హక్కు.

వైద్యంపై అవగాహన లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, వైద్య ఖర్చుల భయం కారణంగా అనేకమంది పేద ప్రజలు సరైన సమయంలో వైద్యం పొందలేక అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితులను గుర్తించాము.

ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు అనే భావనతో, పేదలు, బడుగు బలహీన వర్గాలు, గిరిజన ప్రజలకు వైద్య సహాయం అందించాలనే సంకల్పంతో అభిమాని ఫౌండేషన్ అనేక ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టింది.

మా ఆరోగ్య సేవా కార్యక్రమాలు

01అభిమాని హెల్త్ కార్డులు

వైద్య ఖర్చుల భారం తగ్గించి పేద ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు 2008–2014 మధ్య బొబ్బిలిలో ఐదుగురు ప్రముఖ వైద్యుల సహకారంతో అభిమాని హెల్త్ కార్డులు అందించాము. ఈ కార్డు ద్వారా ప్రాథమిక వైద్యం ఉచితంగా, ఆపరేషన్లలో రాయితీలు, మందుల కొనుగోళ్లపై 10%–20% వరకు రాయితీలు అందిస్తూ వందలాది మంది రోగులకు అండగా నిలిచాము.

02ఉచిత ఆక్సిజన్ సేవలు

బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లే రోగులు ప్రయాణ సమయంలో ఆక్సిజన్ సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తించి 2008లో ఉచిత ఆక్సిజన్ సేవలను ప్రారంభించాము. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్రయాణ సమయంలో ఆక్సిజన్ అందిస్తూ ప్రారంభమైన ఈ సేవ నేటికీ కొనసాగుతోంది.

03రక్తదాన శిబిరాలు

రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించాము. రక్తనిధిని బలోపేతం చేసి అవసరమైన గిరిజన రోగులకు ఉచితంగా రక్తం అందించడంతో పాటు, యువతలో రక్తదాన స్ఫూర్తిని పెంపొందించి వారే స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు నిర్వహించేలా ప్రోత్సహించాము.

రక్తదాన శిబిరాలురక్తదాన శిబిరాలురక్తదాన శిబిరాలురక్తదాన శిబిరాలు

04నేత్ర వైద్య శిబిరాలు

అంధత్వ నివారణ, కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాము. అవసరమైన వారికి కంటి పరీక్షలు, వైద్య సలహాలు అందించి, అర్హులైన రోగులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించేందుకు సహకరించాము.

నేత్ర వైద్య శిబిరాలునేత్ర వైద్య శిబిరాలునేత్ర వైద్య శిబిరాలునేత్ర వైద్య శిబిరాలు

05గుండె మరియు మెగా వైద్య శిబిరాలు

ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. గుల్ల సూర్య ప్రకాష్, MD, CARE, హైదరాబాద్ వారి సహకారంతో మెగా వైద్య శిబిరాలు నిర్వహించాము. గుండె సంబంధిత సమస్యలను గుర్తించి, అత్యవసర చికిత్స అవసరమైన రోగులకు గుండె ఆపరేషన్లు చేయించేందుకు సహకరించాము. గిరిజన ప్రాంతాల్లో కూడా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలను ప్రజలకు చేరువ చేశాము.

గుండె మరియు మెగా వైద్య శిబిరాలుగుండె మరియు మెగా వైద్య శిబిరాలుగుండె మరియు మెగా వైద్య శిబిరాలుగుండె మరియు మెగా వైద్య శిబిరాలు

06మలేరియా నివారణ కార్యక్రమాలు

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం మలేరియా జ్వరాల బారిన పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని, మలేరియా నివారణపై అవగాహన సదస్సులు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాము. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, సకాలంలో వైద్య సహాయం పొందడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము.

మలేరియా నివారణ కార్యక్రమాలుమలేరియా నివారణ కార్యక్రమాలుమలేరియా నివారణ కార్యక్రమాలుమలేరియా నివారణ కార్యక్రమాలు

07హెల్త్ & వెల్త్ అవగాహన సదస్సులు

పాఠశాల విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన పెంపొందించేందుకు హెల్త్ & వెల్త్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, మంచి అలవాట్ల ప్రాముఖ్యతను చిన్నారులకు తెలియజేస్తూ ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు పునాది వేస్తున్నాము.

హెల్త్ & వెల్త్ అవగాహన సదస్సులుహెల్త్ & వెల్త్ అవగాహన సదస్సులుహెల్త్ & వెల్త్ అవగాహన సదస్సులుహెల్త్ & వెల్త్ అవగాహన సదస్సులు

08నడక – ఆరోగ్యానికి తొలి అడుగు

“నడకతోనే ఆరోగ్యం... నడవడికతోనే సాధ్యం!” రోజువారీ నడక ఆరోగ్యానికి ఎంతో అవసరమనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ, వ్యాయామం, నడక, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాము.

09ఇతర ఆరోగ్య పరిరక్షణ సేవలు

ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తిస్తూ, ఆరోగ్య అవగాహన, వైద్య సహాయం, సేవా కార్యక్రమాలు, అత్యవసర సందర్భాల్లో సహకారం వంటి అనేక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నాము.

ఇతర ఆరోగ్య పరిరక్షణ సేవలుఇతర ఆరోగ్య పరిరక్షణ సేవలుఇతర ఆరోగ్య పరిరక్షణ సేవలుఇతర ఆరోగ్య పరిరక్షణ సేవలు
మా సంకల్పం
ప్రాణం విలువైనది...వైద్యం అందక ఏ ఒక్కరూ బాధపడకూడదు!

ఆర్థిక స్థోమత లేని వారికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు అండగా నిలవడం — అభిమాని ఫౌండేషన్ ఆరోగ్య సేవల ప్రధాన ఆశయం.