01కోవిడ్ సేవలతో ప్రారంభమైన అన్నదాన ప్రస్థానం
2020 కోవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్ సమయంలో ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, సాధువులు, గిరిజనులు, బాటసారులు తదితర నిరుపేదలకు అభిమాని ఫౌండేషన్ అండగా నిలిచింది.
సుమారు 80 రోజుల పాటు ప్రతిరోజూ 200 మందికి భోజనం అందిస్తూ, ఆపద సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహార సహాయం అందించడం జరిగింది.
ఆ సేవా ప్రయాణంలో ఆకలి బాధను ప్రత్యక్షంగా గుర్తించి, కేవలం అత్యవసర సమయంలోనే కాకుండా ప్రతిరోజూ ఆకలితో బాధపడుతున్న నిస్సహాయులకు నిరంతర భోజన సేవ అందించాలనే సంకల్పం మరింత బలపడింది.