ముఖ పేజీ / కార్యక్రమాలు / క్రీడలు – యువత అభివృద్ధి

క్రీడలు – యువత అభివృద్ధి

2008 నుంచి వేసవి క్రీడా శిబిరాలు, జిల్లా స్థాయి పోటీలు, ట్రెక్కింగ్, సైక్లింగ్ పోటీలు.

అభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటోఅభిమాని ఫౌండేషన్ కార్యక్రమం ఫోటో

అంతరించిపోతున్న క్రీడా మైదానాలు... ఆటలకు దూరమవుతున్న బాల్యం... విద్యాభ్యాసానికే పరిమితమవుతున్న విద్యార్థుల జీవనశైలి...

క్రీడలే ఆరోగ్యానికి పునాది... క్రీడలే క్రమశిక్షణకు మార్గం... క్రీడలే ఐక్యతకు ప్రతీక...

ప్రైవేటు విద్యాసంస్థల విస్తరణ, మారుతున్న జీవన విధానాల నేపథ్యంలో చిన్నారుల మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి, మానసిక పటిమకు, పోటీతత్వానికి, జాతీయ సమైక్యతకు ప్రతీకలైన క్రీడలు నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితులు నన్నెంతో కలచివేసేవి.

ఒక రాష్ట్ర స్థాయి కో–కో క్రీడాకారుడిగా క్రీడల పట్ల నాకున్న అనుబంధం, క్రీడా మైదానాలు కనుమరుగవుతున్న తీరుపై కలిగిన ఆవేదన, చిన్నారులు ఆటలకు దూరమవుతున్న పరిస్థితులను మార్చాలనే సంకల్పానికి నాంది పలికాయి.

అభిమాని ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ప్రారంభమైన 2008 సంవత్సరం నుంచి నేటి వరకు చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులు, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ, శారీరక ఆరోగ్యం, మానసిక వికాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్నేహభావం, పోటీతత్వం వంటి విలువలను పెంపొందించే అనేక క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

మా క్రీడా కార్యక్రమాలు

01SUMMER SPORTS CAMPS – వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

వేసవి సెలవులు... ఆటలతో ఆనందం... నైపుణ్యాలతో అభివృద్ధి...

2008 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో 45 రోజుల పాటు క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాల్లో ప్రతి సంవత్సరం సుమారు 300–400 మంది చిన్నారులు పాల్గొంటూ వివిధ క్రీడల్లో శిక్షణ పొందేవారు.

చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం పెంపొందించడం ఈ శిబిరాల ప్రధాన లక్ష్యం.

SUMMER SPORTS CAMPS – వేసవి క్రీడా శిక్షణ శిబిరాలుSUMMER SPORTS CAMPS – వేసవి క్రీడా శిక్షణ శిబిరాలుSUMMER SPORTS CAMPS – వేసవి క్రీడా శిక్షణ శిబిరాలుSUMMER SPORTS CAMPS – వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

02DISTRICT LEVEL SPORTS COMPETITIONS – జిల్లా స్థాయి క్రీడా పోటీలు (2008–2019)

క్రీడల పట్ల యువతలో ఆసక్తిని పెంపొందించి, వారి ప్రతిభకు తగిన వేదిక కల్పించాలనే ఆశయంతో 2008 నుంచి 2019 వరకు జిల్లా స్థాయిలో వివిధ క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది.

ప్రధానంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు, చెస్ పోటీలు, పరుగు పందేలు వంటి పోటీల ద్వారా విద్యార్థులు, యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించాము. ఈ పోటీలు యువతలో పోటీతత్వం, క్రీడా స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, పరస్పర స్నేహభావం పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడ్డాయి.

DISTRICT LEVEL SPORTS COMPETITIONS – జిల్లా స్థాయి క్రీడా పోటీలు (2008–2019)DISTRICT LEVEL SPORTS COMPETITIONS – జిల్లా స్థాయి క్రీడా పోటీలు (2008–2019)DISTRICT LEVEL SPORTS COMPETITIONS – జిల్లా స్థాయి క్రీడా పోటీలు (2008–2019)DISTRICT LEVEL SPORTS COMPETITIONS – జిల్లా స్థాయి క్రీడా పోటీలు (2008–2019)

03TREKKING CAMPS – ట్రెక్కింగ్ శిబిరాలు

అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆత్మస్థైర్యం... సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం...

యువతలో సాహస భావన, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రకృతిపై ప్రేమ పెంపొందించడంతో పాటు, వారిని చెడు మార్గాల వైపు వెళ్లకుండా సానుకూల ఆలోచనలు, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు నడిపించాలనే ఆశయంతో ట్రెక్కింగ్ శిబిరాలను నిర్వహించడం జరిగింది.

2013, 2014 మరియు 2016 సంవత్సరాల్లో మొత్తం మూడు ట్రెక్కింగ్ శిబిరాలను నిర్వహించి యువతలో సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, సమిష్టి భావన, మానసిక దృఢత్వం, లక్ష్య సాధన పట్ల నిబద్ధతను పెంపొందించేందుకు కృషి చేశాము.

TREKKING CAMPS – ట్రెక్కింగ్ శిబిరాలుTREKKING CAMPS – ట్రెక్కింగ్ శిబిరాలుTREKKING CAMPS – ట్రెక్కింగ్ శిబిరాలుTREKKING CAMPS – ట్రెక్కింగ్ శిబిరాలు

04CYCLING COMPETITIONS – సైక్లింగ్ పోటీలు

సైక్లింగ్... ఆరోగ్యానికి మేలు... పర్యావరణానికి రక్షణ... యువతకు స్ఫూర్తి...

యువతలో సైక్లింగ్ పట్ల ఆసక్తిని పెంపొందించడం, శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాలనే ఆశయంతో జిల్లా స్థాయిలో వివిధ దూరాల్లో సైక్లింగ్ పోటీలను నిర్వహించడం జరిగింది.

1 KM, 3 KM, 5 KM, 30 KM వంటి విభిన్న దూరాల్లో పోటీలు నిర్వహిస్తూ చిన్నారులు, యువత తమ సామర్థ్యానికి అనుగుణంగా పాల్గొనే అవకాశాన్ని కల్పించాము. ఈ కార్యక్రమాల ద్వారా క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శ్రమ, పట్టుదల, లక్ష్య సాధన, ఆరోగ్య పరిరక్షణ వంటి విలువలను యువతలో పెంపొందించేందుకు కృషి చేశాము.

CYCLING COMPETITIONS – సైక్లింగ్ పోటీలుCYCLING COMPETITIONS – సైక్లింగ్ పోటీలుCYCLING COMPETITIONS – సైక్లింగ్ పోటీలుCYCLING COMPETITIONS – సైక్లింగ్ పోటీలు

మా సేవా ప్రభావం

2008నుంచిచిన్నారులు, యువత కోసం క్రీడా కార్యక్రమాలు
45రోజుల వేసవి శిబిరాలు2008 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం
300–400మంది చిన్నారులు ఏటావేసవి శిబిరాల్లో శిక్షణ
3ట్రెక్కింగ్ శిబిరాలు2013, 2014, 2016
మా క్రీడా సేవల లక్ష్యం
  • చిన్నారులు, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం.
  • శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వాన్ని అభివృద్ధి చేయడం.
  • క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం.
  • జట్టుగా పనిచేసే భావన, స్నేహభావం, జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం.
  • యువతను చెడు అలవాట్లకు, అసాంఘిక మార్గాలకు దూరంగా ఉంచి సానుకూల దిశలో నడిపించడం.
  • ప్రతి చిన్నారికి, యువకుడికి తమ ప్రతిభను ప్రదర్శించేందుకు క్రీడా వేదికలను కల్పించడం.

అభిమాని ఫౌండేషన్ – క్రీడల ద్వారా ఆరోగ్యం, ఐక్యత, ఆత్మస్థైర్యం, యువత అభివృద్ధి కోసం మా సేవా ప్రస్థానం కొనసాగుతుంది.

మైదానాలు మళ్లీ పిల్లలతో కళకళలాడాలి... యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి... ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన సమాజం నిర్మించాలి...